ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదం.. 20 మందికి గాయాలు..
కర్ణాటక సిరిగుప్ప నుండి శ్రీశైలం వెళ్తున్న బస్సు చిన్నారుట్ల వద్ద బ్రేకులు ఫెయిల్ కావడంతో కొండకు ఢీకొట్టింది. దీంతో 20 మందికి గాయాలయ్యాయి. చెట్టుకు ఢీకొనడంతో లోయలో పడకుండా పెను ప్రమాదం తప్పింది. బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వెంటనే స్థానికులు అంబులెన్స్ కు ఫోన్ చేసి గాయాలైన వారిని చికిత్స నిమిత్తం సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ చాకచక్యంగా బస్సును అదుపు చేశాడు. లేకపోతే భారీ ప్రమాదం జరిగేదని స్థానికులు చెబుతున్నారు.

