accidentBreaking NewsHome Page Sliderhome page sliderInternationalNewsNews AlertTrending Todayviral

అప్గాన్ లో బస్సు ప్రమాదం – 71 మంది మృతి

  • అఫ్గాన్‌ శరణార్థులపై డిపోర్టేషన్ ఉక్కుపాదం
  • 15 లక్షల మందికి పైగా స్వదేశానికి రాక
  • కాబూల్‌ వెళ్తున్న బస్సు ఓ బైక్‌ను, ట్రక్కును ఢీ
  • మంటల్లో చిక్కుకుని 17 మంది చిన్నారులు మృతి


అఫ్గానిస్థాన్‌లో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం పశ్చిమ హెరాత్ ప్రావిన్స్లో జరిగింది . ఇరాన్‌ నుంచి తరలిపోతున్న వలసదారుల బస్సుకు మంటలు అంటుకున్నాయి. సమాచారం అందిన వెంటనే అధికారులు ఘటనాస్ధలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ దుర్ఘటనలో సుమారు 71 మంది దాకా చనిపోయారు. బాధితుల్లో మృతుల్లో 17 మంది చిన్నారులు ఉన్నారు.ఇరాన్‌ నుంచి ఇటీవల బహిష్కరణకు గురైన అఫ్గాన్‌ వలసదారులతో మంగళవారం రాత్రి కాబూల్‌ వెళ్తున్న బస్సు, ఓ బైక్‌ను, ట్రక్కును ఢీ కొంది. వెంటనే బస్సులో మంటలు చెలరేగి 71 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. బైక్‌, ట్రక్కులో ఉన్న ఇద్దరు కూడా చనిపోయారని తెలిపారు. నిర్లక్ష్యం, అతివేగం తోనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ కొనసాగుతుందని వివరించారు.మరోవైపు ఈ విషాద ఘటనపై ప్రావిన్స్ ప్రభుత్వ ప్రతినిధి అహ్మదుల్లా ముత్తాకి స్పందించారు. మరణాలు సంఖ్య ధ్రువీకరిస్తూ సంబంధించిన వీడియోను ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇటీవల కాలంలో జరిగిన అత్యంత ఘోరమైన సంఘటనగా వెల్లడించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసుల, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారని పెర్కొన్నారు. బస్సులోని ప్రయాణికులను రక్షించలేకపోయారని తెలిపారు. ట్రక్కుతోపాటు బైక్ను బస్సు ఢీకొనడంతో వెంటనే మంటలు చెలరేగాయని తెలిపారు.మంటలను అదుపు చేయడం కష్టంగా మారిందన్నారు. ఇక బాధితుల గుర్తించేందుకు సాధ్యమైనంత త్వరగా ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. అఫ్గాన్‌ శరణార్థులపై ఉక్కుపాదం మోపుతున్న ఇరాన్‌, పాకిస్థాన్‌ భారీ డిపోర్టేషన్‌ కఠినంగా నిర్వహిస్తున్నాయి. ఈ ఏడాది తొలి నుంచి దాదాపు 15 లక్షల మందికి పైగా అఫ్గాన్ లు ,ఇరాన్‌, పాకిస్థాన్‌ నుంచి బలవంతంగా స్వదేశానికి తిరిగివచ్చారు. జూన్ మధ్యకాలం నుంచే సరిహద్దు దాటడం విపరీతంగా పెరిగింది. సుమారు 40,000 మంది అఫ్గానిస్థాన్కు వచ్చారు. జూన్ 1 నుంచి జులై 5 మధ్య, 449,218 మంది ఆఫ్ఘన్లు ఇరాన్ నుంచి తిరిగి వచ్చారు.