గిరిజనుడి సజీవ దహనం
చేతబడి చేస్తున్నాడన్న నెపంతో గిరిజనుడిని సజీవ దహనం చేసిన ఘటన ఉమ్మడి విశాఖ జిల్లాలో వెలుగు చూసింది.తెలిసిన వివరాల మేరకు…అరకు జిల్లా అరకు ఏజన్సీలోని…డుంబ్రిగూడ గ్రామంలో ఓ వ్యక్తిపై గ్రామస్థులు విపరీతమైన అనుమానాన్ని పెంచుకున్నారు.తమ గ్రామంలో చనిపోతున్న పలువురు వ్యక్తులకు ఆ వ్యక్తే కారణమని భ్రమపడ్డారు.అంతే…గ్రామస్థులంతా ఏకమయ్యారు.దాదాపు 56 ఏళ్ల వయసున్న అడారి డొంబు అనే వ్యక్తిని గొడ్డలితో నరికి చంపేసి పెట్రోల్ పోసి తగులపెట్టారు.ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

