Home Page SliderInternational

అమెరికాలో బ్యాలెట్ బాక్సుల దగ్ధం

అమెరికాలోని అధ్యక్ష ఎన్నికలు జోరుగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాషింగ్టన్, ఒరెగన్‌లో బ్యాలెట్ డ్రాప్ బాక్సులను గుర్తు తెలియని వ్యక్తులు  దగ్ధం చేయడం సంచలనం రేపింది. అక్కడి ఫ్రిస్కో, టెక్సస్‌లో కీలకంగా ప్రవాస భారతీయ ఓటర్లు ఉండడం గమనార్హం. మరో వారంలో అమెరికా ఎన్నికలు పూర్తి కానున్నాయి. అభ్యర్థులు కమలా హారిస్, ట్రంప్‌లు జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు. జార్జియాలో ఎన్నికలు సాఫీగా జరగడం లేదని స్థానికులు నిరసనలు తెలిపారు. అట్లాంటాలో ట్రంప్ ప్రచారం చేస్తున్నారు. హారిస్, వాల్జ్‌ల జోడీకి ఓటు వేయాలని మాజీ అధ్యక్షుడు ఒబామా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డెలావర్‌లో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఓటుహక్కు వినియోగించుకున్నారు.