మంటల్లో సజీవ దహనం
మణికొండలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మున్సిపాలిటీ పరిధిలోని ఓ దుకాణంలో అగ్ని ప్రమాదం జరగడంతో ఇదే భవనంలో ఉన్న ముగ్గురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు.మంటల్లో కాలిపోయి బూడిదగా మిగిలారు. అంతా చూస్తుండగానే అగ్నికీలల్లో తగలబడిపోయారు. అగ్ని ప్రమాదంలో చిన్నారి సీజీరా ఖాతున్(7), జమీలా ఖతున్ (70), సహనా ఖాతూన్ (40) లు మృతి చెందినట్లు అగ్నిమాపవక సిబ్బంది తెలిపారు. ఇదే ప్రమాదంలో చిక్కుకున్న ఐదుగురిని అతి కష్టం మీద కాపాడారు అగ్నిమాపక సిబ్బంది. మరికొంత మందికి శరీరాలు పాక్షికంగా కాలిపోయాయి. గ్యాస్ సిలిండర్లు పేలడంతోనే ప్రమాదం సంభవించినట్లు పోలీసులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు.ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు చనిపోవడంతో మణికొండలో విషాదఛాయలు అలముకున్నాయి. మంటల్లో నుంచి బయటపడినవారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

