బుమ్రా సరికొత్త రికార్డు..
భారత ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా సరికొత్త రికార్డులు సాధించారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా ప్రకటించిన ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆపి ది ఇయర్ రివార్డును బుమ్రా గెలుచుకున్నారు. గత ఏడాది టెస్ట్ మ్యాచ్‌లలో జస్ప్రీత్ బుమ్రా తన అద్భుతమైన ప్రదర్శనతో ఈ అవార్డును అందుకున్నాడు. 2024లో తన చిరస్మరణీయ ప్రదర్శనకు ఈ అవార్డు సాధించారు. గతేడాది జస్ప్రీత్ బుమ్రా 13 టెస్ట్ మ్యాచ్‌లలో 71 వికెట్లు తీశారు. భారత్ నుండి ఎంపికైన తొలి ఫాస్ట్ బౌలర్ అతనే కావడం విశేషం.