ఐపీఎల్‌లో బుమ్రా ఎంట్రీ అప్పుడే..
టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా కొన్ని రోజులుగా క్రికెట్‌కు దూరంగా ఉన్నారు. వెన్నునొప్పితో చికిత్స పొందుతున్నారు. బుమ్రా ఎంట్రీ కోసం అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఐపీఎల్ ప్రారంభంలో ముంబయి మ్యాచ్‌లకు బుమ్రా దూరం కానున్నారు. ఏప్రిల్ తొలి వారంలో ఆయన జట్టులో చేరవచ్చని సమాచారం. కాగా ముంబయి తన తొలి మ్యాచ్‌ను మార్చి 23న సీఎస్కేతో ఆడనుంది. తర్వాత మార్చి 29న గుజరాత్ టైటాన్స్, 31న కేకేఆర్‌తో తలపడుతుంది. ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా బుమ్రా లేని లోటు అభిమానులు ఫీలయ్యారు.