home page sliderHome Page SliderNationalNewsNews AlertSportsTrending Todayviral

మరోసారి బుమ్రానే టాప్..

టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) (901) టెస్టు ర్యాంకింగ్స్ లో మరోసారి అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇంగ్లాండ్ తో జరిగిన మూడో టెస్టులో ఏడు వికెట్లు పడగొట్టిన సంగతి తెలిసిందే. రెండో స్థానంలో ఉన్న కగిసో రబాడ (851) బుమ్రాకు మధ్య 50 రేటింగ్ పాయింట్ల వ్యత్యాసం ఉంది. వెస్టిండీస్ తో జరిగిన పింక్ బాల్ టెస్టులో హ్యాట్రిక్ సహా ఆరు వికెట్లు తీసిన ఆసీస్ పేసర్ స్కాట్ బోలాండ్ ఆరు స్థానాలు ఎగబాకాడు. ఈ క్రమంలో బోలాండ్ ఆరో స్థానంలో నిలిచి కెరీర్లో బెస్ట్ ర్యాంకు అందుకున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్లు పాట్ కమిన్స్ (3వ), హేజిల్ వుడ్ (4వ), నాథన్ లైయన్ (8వ), మిచెల్ స్టార్క్ (10వ) స్థానాల్లో కొనసాగుతున్నారు. దీంతో టాప్-10లో ఐదుగురు ఆస్ట్రేలియా బౌలర్లు ఉన్నట్లయింది. ఆసీస్ తో జరిగిన డే/నైట్ టెస్టులో ఎనిమిది వికెట్లు తీసిన విండీస్ ఫాస్ట్ బౌలర్ షమార్ జోసెఫ్ 15 స్థానాలు ఎగబాకి 14వ ర్యాంకులో నిలిచాడు. లార్డ్స్ టెస్టులో నాలుగు వికెట్లు తీసిన భారత స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ 12 స్థానాలు మెరుగై 46వ ర్యాంకుకు చేరుకున్నాడు.
బ్యాటింగ్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ (888) తిరిగి అగ్రస్థానానికి చేరుకున్నాడు. భారత్ తో జరిగిన మూడో టెస్టులో రూట్ (104, 40) రాణించిన సంగతి తెలిసిందే. హ్యారీ బ్రూక్ (862) మూడో స్థానానికి పడిపోగా.. కేన్ విలియమ్సన్ (867) రెండో ప్లేస్ కు చేరుకున్నాడు. యశస్వి జైస్వాల్ (801)ను వెనక్కినెట్టి స్టీవ్ స్మిత్ (816) నాలుగో స్థానంలో నిలిచాడు. రిషబ్ పంత్ ఒక స్థానం డౌన్ అయి ఎనిమిదో స్థానానికి, శుభమన్ గిల్ మూడు స్థానాలు దిగజారి తొమ్మిదో ర్యాంక్ కు పడిపోయారు. రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ ఐదేసి స్థానాలు మెరుగై వరుసగా 34, 35 ర్యాంక్ ల్లో నిలిచారు.