Breaking NewscrimeHome Page SliderNewsTelangana

అల్కాపురి కాల‌నీలో యువ‌కుని దారుణ హత్య‌

రంగారెడ్డి జిల్లా నార్సింగి మండ‌లం అల్కాపురిలో ఐడిపిఎల్‌కి చెందిన రోహిత్ అనే యువ‌కుణ్ణి తోటి స్నేహితులే దారుణంగా హ‌త్య చేశారు. బ‌ర్త్ డే పార్టీ ఉంద‌ని పిలిచి న‌లుగురు ఫ్రెండ్స్ ఈ ఘాతుకానికి పాల్ప‌డ్డారు. అంతా మ‌ద్యం సేవించి బీరు బాటిళ్లు ప‌గ‌ల‌గొట్టి మ‌రీ యువ‌కుణ్ణి చంపేశారు. పోలీసులు నిందితుల కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ప‌రిశీలించారు.అనుమ‌నాస్ప‌దంగా ఉన్న వారిని ఇప్ప‌టికే అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి కోసం గాలింపు ముమ్మ‌రం చేశారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.