Breaking NewscrimeHome Page Slider

హైద్రాబాద న‌డివీధుల్లో పాశ‌విక హ‌త్య‌

హైదరాబాద్‌లో వరుస హత్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా.. ఓ వ్యక్తిని కొందరు దుండగులు మర్డర్‌ చేయడం కలకలం రేపుతోంది. నిందితులను పట్టుకునేందుకు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. వ్యక్తి దారుణ హత్య హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో చోటుచేసుకుంది. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని శివగంగకాలనీలో శనివారం అర్ధరాత్రి బొడ్డు మహేష్‌ అనే వ్యక్తిని కొందరు దుండగులు కత్తులు, గొడ్డళ్లతో నరికి చంపడం సంచలనం సృష్టిస్తోంది. ముందుగా కారుతో ఢీకొట్టగా.. మహేష్‌ పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో.. వెంటాడి మరీ కత్తులు, గొడ్డళ్లతో నరికి హత్య చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్‌ అయ్యాయి. మృతుడు బొడ్డు మహేష్‌.. ఇటీవలే ఓ కేసులో బెయిల్‌పై బయటకొచ్చాడు. దాంతో.. పాతకక్షలతోనే హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు. మహేష్‌ మృతితో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్లాన్‌ ప్రకారమే కొందరు వ్యక్తులు మహేష్‌ను హత్య చేశారని ఆరోపించారు.