న్యూ ఇయర్ పార్టీలో దారుణ హత్య..
గోవాలో న్యూ ఇయర్ పార్టీలో జరిగిన దారుణ హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొత్త సంవత్సర వేడుకల కోసం గోవాకు వెళ్లిన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. బొల్లా రవితేజ (28) అనే తాడేపల్లి గూడెం యువకుడు హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పనిస్తున్నాడు. తన స్నేహితులతో కలిసి గోవాలోని కలంగుట్ బీచ్‌లో వీరంతా సరదాగా గడిపారు. తర్వాత సోమవారం మరీనా బీచ్ షాక్ అనే రెస్టారెంట్‌కు భోజనానికి వెళ్లారు. ఆ ఫ్రెండ్స్ గ్రూప్‌లోని ఒక యువతి హోటల్ బిల్లు విషయంలో హోటల్ నిర్వాహకుడితో వాగ్వాదం పెట్టుకోవడంతో వారు ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించారు. దీనితో రవితేజ ఫ్రెండ్స్ గ్రూప్‌కు, వారికి జరిగిన పోరాటంలో కొందరు రవితేజపై కర్రలతో దాడి చేశారు. దీనితో తలకు తీవ్ర గాయాలతో అతడు మరణించాడు. రాష్ట్రప్రభుత్వం చొరవతో ప్రత్యేక విమానంలో గోవా నుండి గన్నవరం విమానాశ్రయానికి వచ్చింది. గురువారం నాడు తాడేపల్లి గూడెంలోని అతని నివాసానికి చేర్చారు.
Breaking news : రైలు పట్టాలపై పబ్ జీ గేమ్.. గాలిలో కలిసిన టీనేజర్ల ప్రాణాలు

