హాస్పిటల్ కు కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ ల్లో భర్తీ అయ్యారు. మెడికల్ టెస్ట్ కోసం ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రానికి వైద్య పరీక్షలు పూర్తవుతాయని డాక్టర్లు చెబుతున్నారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్నప్పుడులో గైనిక్ సమస్యలు, తీవ్ర జ్వరంతో కవిత పలుసార్లు అనారోగ్యానికి గురయ్యారు. అప్పట్లో ఆమె ఢిల్లీ లోని ఎయిమ్స్ లో ట్రీట్ మెంట్ చేయించుకున్నారు. ఈనేపథ్యంలో మరోసారి ఇవాళ హాస్పిటల్ ల్లో అడ్మిట్ అయ్యారు.