ఆటోల్లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నిరసన..
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వినూత్న రీతిలో అసెంబ్లీలో నిరసనలు తెలియజేస్తున్నారు. ఖాకీ దుస్తులు ధరించి, ఆటో డ్రైవర్ల వేషంలో అసెంబ్లీకి బయలుదేరారు. మహిళలకు ఉచితబస్సుల కారణంగా ఆటోడ్రైవర్లు పలు కష్టాలు ఎదుర్కొంటున్నారని వారు పేర్కొన్నారు. వారి సమస్యలు తీర్చాలని డిమాండ్ చేస్తూ వీరు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ సంవత్సర పాలనలో దాదాపు 100 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని వీరు ఆరోపిస్తున్నారు. బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ స్వయంగా ఆటో నడుపుతూ అసెంబ్లీకి వచ్చారు. మంగళవారం కూడా ఇలాగే వీరు నల్లచొక్కాలు ధరించి సభలో నిరసనలు తెలియజేశారు. సోమవారం చేతులకు బేడీలు ధరించి, లగచర్ల ఘటనపై ఆందోళన చేశారు.

