దెబ్బకు దిగొచ్చిన కేటీఆర్, ప్రవళిక విషయంలో బీఆర్ఎస్ మార్క్ ట్విస్ట్
ప్రవళిక విషయంతో సర్కార్ దొంగాట
ఆత్మహత్యకు పరీక్షలు కారణం కాదంటూ కొంగజపం
పరీక్ష దరఖాస్తులు బయటపడేసరికి సీన్ చేంజ్
ప్రవళిక కుటుంబ సభ్యులతోనే ఆమెపై నిందలు మోపిస్తారా?
ప్రవళిక మంచిది కాదని చెప్పిస్తారా ఏంది?
రాజకీయంగా నష్ట నివారణ చర్యలు
ప్రవళిక ఆత్మహత్య విషయంలో ఇప్పుడు కుటుంబ సభ్యుల సాక్షిగా నిందలు వేసేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. మొదట ప్రవళిక గ్రూప్ పరీక్షలకు ప్రిపేర్ కాలేదన్న పోలీసులు ఇప్పుడు కుటుంబానికి ఉద్యోగం ఆశ చూపించి.. ప్రవళికే మంచిదికాదన్న భావనను కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. నవ్వి పోదురుగాక నాకేంటన్న చందంగా మొత్తం పరిస్థితి మారిపోతోంది.

ప్రవళిక ఆత్మహత్య విషయంలో ప్రభుత్వం నాలిక్కరుచుకుంది. ప్రవళిక హైదరబాద్‌లో గ్రూప్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతూ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. గ్రూప్ 2, గ్రూప్ 4 పరీక్షలు వాయిదా పడటంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నారని తొలుత కుటుంబ సభ్యులతోపాటు, తోటి విద్యార్థినులు చెప్పారు. ఐతే పోలీసు శాఖ, ప్రభుత్వ వర్గాలు మాత్రం ప్రవళిక, ప్రియుడు కారణంగానే ఆత్మహత్యకు పాల్పడిందంటూ ప్రకటించాయి. మంత్రి కేటీఆర్ సైతం మీడియా సాక్షిగా ప్రవళిక విషయంలో ఘోరంగా కామెంట్ చేశారు. అసలు ప్రవళిక ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోలేదని ఆమె కేవలం ప్రియుడు మోసగించాడనే చనిపోయిందంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ప్రవళిక గ్రూప్ పరీక్షలకు అప్లై చేసిన డాక్యుమెంట్లు బయటకు వచ్చాయి.

పరీక్షలు సరిగా నిర్వహించలేని ప్రభుత్వం, కట్టుకథలు చెబుతుందంటూ విపక్షాలు మండిపడ్డాయి. ప్రవళిక కుటుంబాన్ని పరామర్శించి, అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చాయి. అయితే తాజాగా నాడు ప్రవళికను అవమానించేలా ప్రకటన చేసిన మంత్రి కేటీఆర్, ఇప్పుడు ఆమెకు అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు. ప్రవళిక కుటుంబ సభ్యులను క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకొని ఆమె కుటుంబానికి కేటీఆర్ ధైర్యం చెప్పారు. ప్రవళిక సోదరుడికి ఉద్యోగంతోపాటుగా కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. పోయిన ప్రవళికను తిరిగి తేలేమన్న కేటీఆర్, కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు. అదే సమయంలో ప్రవళిక ఎవరి వల్ల చనిపోయిందో ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలని ఆమె కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తమకు న్యాయం చేస్తోందని.. మంత్రి కేటీఆర్‌తో భేటీ తర్వాత ప్రవళిక కుటుంబ సభ్యులు చెప్పారు.

ప్రవళిక విషయంలో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది. బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్న మంత్రి చేసే వ్యాఖ్యలు ఇవేనా అంటూ విమర్శలు వెల్లువెత్తాయ్. రాజకీయంగా విపక్షాలు సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టాయ్. దీంతో నష్టనివారణ చర్యల్లో భాగంగా మంత్రి కేటీఆర్, ప్రవళిక కుటుంబ సభ్యులను క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకొని సాయం చేస్తామంటూ భరోసా ఇచ్చారు.