Home Page SliderNews AlertPoliticstelangana,

తెలంగాణ తల్లికి బీఆర్‌ఎస్ నేతల పాలాభిషేకం..

తెలంగాణ వ్యాప్తంగా బీఆర్‌ఎస్ శ్రేణులు తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చడంతో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ కాలంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకాలు చేస్తున్నారు.  తెలంగాణ భవన్‌లోని తెలంగాణ తల్లి విగ్రహానికి ఎమ్మెల్సీ కవిత పాలాభిషేకం చేస్తామని చెప్తున్నారు. పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావు తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేశారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం పేరిట కాంగ్రెస్ తల్లి విగ్రహం, కాంగ్రెస్ చేతి గుర్తుతో ఏర్పాటు చేశారన్నారు. కేసీఆర్ వల్లే తెలంగాణ అస్తిత్వం ఏర్పడిందని, కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ అన్నారు.