Home Page SliderTelangana

బీఆర్‌ఎస్‌ ‘రెంటికి చెడ్డ రేవడి’ అయ్యింది-ఈటల

బీఆర్‌ఎస్ పార్టీ పరిస్థితి ‘రెంటికి చెడ్డ రేవడి’ అయ్యినట్లయ్యిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. తెలంగాణ రాష్ట్ర బీజపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ  బీఆర్‌ఎస్ పార్టీ అటు బీజేపీ కూటమి,ఇటు కాంగ్రెస్ కూటమి రెండిటి  నమ్మకాన్ని పోగొట్టుకుందన్నారు. చివరికి తెలంగాణ ప్రజలు కూడా నమ్మడం లేదన్నారు. తెలంగాణలో పాలన చేసే సత్తా లేదు కానీ.. ‘కూట్లో రాయి తీయలేని వాడు, ఎట్లో రాయి తియ్యడానికి పోయినట్టు’.. విమానాలు వేసుకొని అన్ని పార్టీల దగ్గరికి పోయారని ఎద్దేవా చేశారు. . ‘నన్ను నాయకున్ని చేయండి దేశమంతా ఎన్నికలకు  ఫండింగ్ చేస్తా’ అని చెప్పి వచ్చారు. అయినా కేసిఆర్ ను ఎవరు నమ్మడం లేదన్నారు. అక్రమ కేసులు పెట్టి బీజేపీ నాయకులను, కార్యకర్తను వేధిస్తున్నారని మండిపడ్డారు. మీ పాలనకు పోయేకాలం వచ్చింది. కేసిఆర్ మీ పార్టీ ఊదితే కొట్టుకు పోయే పార్టీ,మాతో గొక్కోవద్దు, ఖబర్ధార్ అంటూ హెచ్చరించారు. అందుకే డబ్బులు ఉన్నాయి, అధికారం ఉంది అని మిడిసి పడకూడదని హితవు చెప్తున్నారు.