నీ ఎకిలి చేష్టల వల్లే బీఆర్ఎస్ కుప్పకూలింది..
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై విజయవాడ టీడీపీ నాయకుడు బుద్దా వెంకన్న రెచ్చిపోయారు. ఏపీకి కూడా పెట్టుబడులు వస్తున్నాయి, తెలంగాణకు రావడం లేదంటూ కేటీఆర్ పెట్టిన ఓ ట్వీట్ కు బుద్దా వెంకన్న తీవ్రంగా స్పందించారు. కేటీఆర్.. నీ ఎకిలి చేష్టల వల్లే బీఆర్ఎస్ కుప్పకూలిందని బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు. చంద్రబాబుపై ఎకిలిగా మాట్లాడడమే బీఆర్ఎస్ పార్టీ పతనానికి కారణమని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేస్తే వంద దేశాల్లో పైగా నిరసనలు చేశారన్నారు. మీకు తెలంగాణలోనే దిక్కు లేదు.. ఏపీ గురించి మీకెందుకు? అని నిలదీశారు. కేటీఆర్ ను ఉద్దేశించి తీవ్ర పదజాలంతో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బుద్దా వెంకన్న చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

