లిక్కర్ కేసులో అన్నదమ్ముల సవాల్..
ఏపీ లిక్కర్ స్కామ్‌లో రాజకీయ అన్నదమ్ములు కేశినేని నాని, చిన్నిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. టీడీపీ, వైసీపీ పార్టీలకు చెందిన వారిద్దరూ పరస్పర ఆరోపణలు చేసుకుంటూ తరచూ వార్తల్లోకెక్కుతున్నారు. తాజాగా టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిని కూడా లిక్కర్ స్కామ్‌లో విచారించాలని వైసీపీ మాజీ ఎంపీ కేశినేని నాని డిమాండ్ చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డి కంపెనీలలో కేశినేని చిన్ని కుటుంబానికి వాటా ఉందని, చిన్ని కంపెనీలలో కసిరెడ్డి వాటాదారు అని ఆరేపించారు. వీరిద్దరూ మనీలాండరింగ్ ద్వారా నిధులను విదేశాలకు మళ్లించారని నాని ట్వీట్ చేశారు.

