ప్రధానికి సోదరుడి సలహా..
పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు మాజీ ప్రధాని, సోదరుడు నవాజ్ షరీఫ్ కీలక సలహాలను అందించారు. భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతలకు కళ్లెం వేయాలని, పరిష్కారం కోసం దౌత్య మార్గాన్ని అనుసరించాలని నవాజ్ సూచించారు. రెండు దేశాలు అణ్వాయుధాలు కలిగిన నేపథ్యంలో ఆచితూచి అడుగులు వేయాలని నవాజ్ నివాసంలో వారి మధ్య జరిగిన భేటీలో పేర్కొన్నారని సమాచారం. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ తీసుకున్న కఠిన చర్యలకు గాను, పలువురు పాక్ మంత్రులు తీవ్రంగా స్పందిస్తున్నారు. సింధు నదిలో రక్తం పారుతుందని, తమ వద్ద అణుబాంబులు ఉన్నాయని బెదిరింపు వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనితో ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని సంయమనం పాటించాలని పరస్పర ప్రయోజనాలు కాపాడుకోవాలని సలహా ఇచ్చారు.

