Breaking NewscrimeHome Page SliderTelangana

లంచ‌గొండి ఎస్సై అరెస్ట్‌

తెలంగాణ‌లో లంచ‌గొండి అధికారులు పుట్ట‌గొడుగుల్లా ప‌ట్టుబ‌డుతున్నారు. ప్ర‌తీ శాఖా అవినీతి కంపుకొడుతుంది.అధికారులు అందిన కాడికి దండుకుంటున్నారు.ప్ర‌జ‌ల‌ను లంచాల కోసం ప‌ట్టి పీడిస్తున్నారు.ఈ మ‌ధ్య కాలంలో పోలీస్ శాఖ‌లో ప‌ట్టుబ‌డుతున్న ఎస్సైల సంఖ్య విప‌రీతంగా పెరిగింది. తాజాగా ధరూర్ ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు.వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం నాగసముందర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని కేసు నుండి తప్పించేందుకు రూ.70 వేలు లంచం డిమాండ్ చేసి ఏసిబికి చిక్కాడు ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్.గతంలో తాండూర్ పట్టణ ఎస్సైగా విధులు నిర్వహించిన వేణుగోపాల్ గౌడ్ బ‌దిలీపై ఇక్క‌డ‌కు వ‌చ్చారు.వచ్చీరాగానే బ‌ల్ల‌కింద చేతులు పెట్ట‌డంతో ఏసిబికి దొరికిపోయాడు.ఏసిబి అధికారులు ఎస్పైని అరెస్ట్ చేసి కోర్టులో హాజ‌రుప‌రిచారు.