Home Page SliderTelangana

భద్రాద్రి దేవస్థానంలో నేటి నుండి బ్రేక్ దర్శనం

TG: భద్రాద్రిలోని శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానంలో ఇవాళ నుండి బ్రేక్ దర్శనం భక్తులకు లభించనుంది. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 9.30 వరకూ.. రాత్రి 7 గంటల నుండి 7.30 గంటల వరకు బ్రేక్ దర్శనం ఇవ్వనున్నారు. బ్రేక్ దర్శనం సమయంలో ఎటువంటి పూజలూ ఉండవని ఆలయ అధికారులు వెల్లడించారు. టిక్కెట్ ధర రూ.200 గా దేవస్థానం అధికారులు నిర్ణయించారు.