NationalNews Alert

“ బ్రహ్మాస్త్ర” అతని రాకకై ఎదురు చూస్తోంది

ఈమధ్యకాలంలో పాన్ ఇండియా సినిమాల జోరు ఎక్కువయ్యింది. బాలీవుడ్‌లో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ , అలియా భట్ , అమితాబ్ బచ్చన్ , అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రల్లో తెరకెక్కనున్న చిత్రం “ బ్రహ్మాస్త్ర ”. ఇప్పటికే దీని ట్రైలర్ అందరిని ఆకట్టుకుంటోంది.. ఇందులో రణ్‌బీర్ కపూర్  కొన్ని అధ్భుత శక్తులు కలిగి ఉండటం  ప్రేక్షకుల దృష్టిని మరింత ఆకర్షిస్తోంది. సెప్టెంబర్ 9 న ఈ సినిమా తెర ముందుకు రానుంది. ఈ సినిమా మొదటి భాగాన్ని బ్రహ్మాస్త్ర మొదటి భాగం: శివ టైటిల్‌తో విడుదల చేయనున్నారు.

అయితే బ్రహ్మాస్త్ర ప్రీ రిలిజ్ ఈవెంట్ నిర్వహణకు చిత్రబృందం సర్వం సిద్ధం చేస్తుంది. అయితే ఈ గ్రాండ్ ఈవెంట్  ప్రపంచ ప్రఖ్యాతి చెందిన రామోజీఫీల్మ్ సిటీ వేదిక కానుంది. ఈ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రత్యేక అతిథిగా అహ్వానించినట్టు.. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్ర బృందం ఓ స్పెషల్  వీడియోను షేర్ చేసింది. ధర్మా ప్రొడెక్షన్ పతాకంపై కరణ్ జోహార్ దీన్ని నిర్మించారు. చిత్రానికి సంబంధించిన ఫోటోలు , పాటలు అందరిని ఆకట్టుకుంటున్నాయి.