Breaking NewscrimeHome Page SliderTelangana

లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన బాలుని మృతి

లిఫ్ట్ లో ఇరుక్కుపోయి ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న‌ ఆరేళ్ల ఆర్న‌వ్ శ‌నివారం మృతి చెందాడు. మాసబ్ ట్యాంక్, శాంతినగర్ లోని అపార్ట్మెంట్లో శుక్ర‌వారం జ‌రిగిన ఘ‌ట‌న‌లో బాలుడు తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన సంగ‌తి తెలిసిందే.అయితే అతిక‌ష్టం మీద బాలుణ్ణి ర‌క్షించిన అనంత‌రం నీలోఫ‌ర్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు.బాలుణ్ణి ర‌క్షించేందుకు వైద్యులు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికీ ప్రాణాలు కాపాడ‌లేక‌పోయారు.దీంతో ఆసుప‌త్రి ప్రాంగ‌ణం త‌ల్లిదండ్రులు,బంధువుల రోద‌న‌ల‌తో మిన్నంటాయి. ఆర్న‌వ్ బ‌త‌కాల‌ని సోష‌ల్ మీడియాలోనూ సానుకూలంగా కామెంట్లు పెట్ట‌డం గ‌మ‌నార్హం.