చర్చలు ప్రారంభించిన ఇరు దేశాలు
కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరిన వేళ భారత్, పాకిస్తాన్ మధ్య ఇవాళ హాట్ లైన్ లో ఇరు దేశాల డైరెక్టర్ అండ్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ ల చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ భేటీలో భారత డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, పాకిస్థాన్ డీజీఎంవో మేజర్ జనరల్ కాశిఫ్ చౌదరి పాల్గొన్నారు. అయితే, ఈ భేటీలో ప్రధానంగా కాల్పుల విరమణ కొనసాగింపు, సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల తగ్గింపు, పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై చర్చించనున్నారు. పహెల్గాం టెర్రర్ అటాక్ నేపథ్యంలో తీసుకున్న దౌత్యపరమైన కఠిన నిర్ణయాలు, సింధూ జలాల అంశంలో భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ప్రజల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.