జన్మించి….మరణించి….జన్మించి
అమ్మా నాన్నా.. అంటూ అర్ధవంతంగా పిలుస్తూ అప్పుడే జన్మించాడని మురిసిపోతున్న తల్లిదండ్రుల ఆశలపై నీళ్ళు చల్లేలా మరణించాడు.అలా మరణించాడో లేదో….అవయవదానం చేసి మళ్లీ జన్మించాడు. పదేళ్ల బాలుడిని కన్న కన్నోళ్ల దీన గాథ శ్రీకాకుళం జిల్లాల్లో చోటు చేసుకుంది.తాను చనిపోతూ ఐదుగురికి ప్రాణం పోశాడు ఓ పదేళ్ల బాలుడు .శ్రీకాకుళం జిల్లా కాపుగోదాయవలసకు చెందిన యువంత్ ఆరో తరగతి చదువుతున్నాడు.జనవరి 29న పుట్టిన రోజు చేసుకున్న తర్వాత రోజు కళ్లు తిరిగి పడిపోయాడు. అయితే పరీక్షలు చేసిన వైద్యులు గిలియన్ బ్యారీ సిండ్రోమ్ వ్యాధి సోకిందని చెప్పారు. బ్రెయిన్ డెడ్ కావడంతోనే బాలుడు చనిపోయాడని వైద్యులు తెలిపారు.అయితే అప్పటికే అవయవ గ్రహీతల నుంచి వాంటింగ్ ఉండటంతో వైద్యులు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు వివరించారు.తన కొడుకు మరణించినా మళ్లీ జన్మించేలా అవయవదానానికి అంగీకరించారు తల్లిదండ్రులు. బాలుడి రెండు కళ్లు, లివర్, రెండు కిడ్నీలను సేకరించారు.త్వరలోనే మరొకొంత మంది బాలురకు వాటిని అమర్చనున్నారు.దీంతో బాలుడు….జన్మించడం…మరణించడం…మళ్లీ జన్మించడం కలలా జరిగిపోయిందని కన్నోళ్లు కన్నీటిపర్యంతమౌతున్నారు.

