రైలును బాంబులతో పేల్చేసి…
పాకిస్థాన్ లో బలోచ్ మిలిటెంట్లు చెర నుంచి రైలు ప్రయాణికులను విడిపించేందుకు ఆర్మీ చేపట్టిన సైనిక ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటివరకు 80 మందిని కాపాడారు. 100 మందికి పైగా ఇంకా బందీలుగా ఉన్నట్లు తెలుస్తోంది. రైలు క్వెట్టా నుంచి పెషావర్ కు వస్తుండగా ఓ సొరంగం వద్ద మిలిటెంట్లు రైల్వే ట్రాకును బాంబులతో పేల్చేశారు. రైలు మంటల్లో చిక్కుకొని ఆగిపోవడంతో మిలిటెంట్లు దాన్ని హైజాక్ చేసి 30 మందిని చంపేశారు.మృతు సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించింది.సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.కాగా రైలుని బాంబులతో పేల్చేయడంతో ట్రాక్ పూర్తిగా దెబ్బతిన్నది.ఆ మార్గంలో వెళ్లాల్సిన రైళ్లను పూర్తిగా దారిమళ్లించారు.