చందాకొచ్చర్ దంపతులకు నిరాశ పరిచిన బాంబే హైకోర్టు
వీడియోకాన్ రుణ కేసులో ఐసీఐసీఐ మాజీ సీఈఓ చందాకొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌లకు బాంబే హైకోర్టు షాక్‌ను గురి చేసింది. సీబీఐ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ అత్యవసర విచారణ జరపాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. జనవరి 2న సాధారణ విచారణ కోసం కోర్టును ఆశ్రయించాలని సూచించింది. వీడియోకాన్ రుణ కేసులో చందాకొచ్చర్ దంపతులను సీబీఐ ఈ నెల 23న అరెస్ట్ చేసింది. వీరికి ప్రత్యేక కోర్టు 3 రోజులపాటు రిమాండ్ విధించింది. అదనపు గడువు కోరుతూ సీబీఐ అప్పీల్ చేసింది. దీంతో కొచ్చర్ దంపతులకు 28 వరకు రిమాండ్ పొడిగించింది. అయితే.. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద సీబీఐ అరెస్ట్ అక్రమమని పేర్కొంటూ చందా కొచ్చర్ దంపతులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై అత్యవసర విచారణ జరపాలని కోరారు. అందుకు కోర్టు నిరాకరించింది.