శంషాబాద్‌లో బాంబు బెదిరింపులు..
శంషాబాద్ విమానాశ్రయంలో ఉదయ్ పూర్ వెళ్లే విమానంలో బాంబు ఉందంటూ సమాచారం అందింది. దీనితో విమానాశ్రయం మొత్తం అలెర్టయ్యింది. బుధవారం ఉదయం హైదరాబాద్ నుండి రాజస్థాన్‌లోని ఉదయపూర్‌కు వెళ్లే ఇండిగో విమానంలో బాంబు ఉందని టాయిలెట్లలో నోట్ దొరికింది. దీనితో ఏటీసీ అధికారులు విమాన సర్వీసును రద్దు చేసి, నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి తనిఖీలు చేశారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం బుధవారం సాయంత్రం విమానం బయలుదేరింది.
Tollywood updates: తిరుమల శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకున్న హీరోయిన్


 
							 
							