Home Page SliderNationalNews AlertTrending Today

పరీక్షా పే చర్చలో మోదీతో పాటు బాలీవుడ్ హీరోయిన్

ప్రతీ సంవత్సరం పరీక్షల సీజన్‌కు ముందుగా ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులలో భయాన్ని పోగొట్టడానికి పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా ఫిబ్రవరి 10న ఢిల్లీలోని భారత్ మండపం టౌన్‌హాల్‌లో జరగబోయే ఈ కార్యక్రమంలో కొత్త ఫార్మాట్‌లో సరికొత్త పద్దతులు పాటించబోతున్నారు. ఈ ఏడాది ప్రధాని మోదీతో పాటు బాలీవుడ్ నటీనటులు, ఇతర రంగాల ప్రముఖులు కూడా పాల్గొంటున్నారు. ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇంకా సద్గురు జగ్గీ వాసుదేవ్, నటులు విక్రాంత్ మస్సే, భూమి పడ్నేకర్, బాక్సర్ మేరీ కోమ్, అథ్లెట్ అవని లేఖరా వంటి ప్రముఖులెందరో పాల్గొనబోతున్నారు. వీటితో విద్యార్థులలో స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేస్తున్నారు. దీనికోసం డిసెంబర్‌ 14 నుండి జనవరి 24 వరకూ రిజిస్ట్రేషన్లు జరిగాయి. దేశవ్యాప్తంగా 9.27 లక్షల మంది విద్యార్థులు, 1.01 లక్షల మంది టీచర్లు, 24 వేల మంది తల్లిదండ్రులు రిజిస్టర్ అయ్యారు. ఈవెంట్లో పాల్గొనడానికి 2,500 మందిని ఎంపిక చేసి, వారికి విద్యాశాఖ నుండి పీపీసీ కిట్స్ అందిస్తారు. ఎంపికైన విద్యార్థులు నేరుగా ప్రధానితో మాట్లాడే చర్చలో పాల్గొంటారు.