‘మోదీ’ నెక్లెస్‌తో కాన్స్‌లో మెరిసిన బాలీవుడ్ నటి
ఫ్యాషన్ ప్రపంచంలో కాన్స్ వేదికది ప్రత్యేకస్థానం. పలువురు ప్రసిద్ధ మోడల్స్, నటులు ఫ్యాషన్ ఐకాన్స్, సెలబ్రెటీలు ఈ ప్రతిష్టాత్మక రెడ్ కార్పెట్‌పై ప్రతీ సంవత్సరం సందడి చేస్తుంటారు. తాజాగా బాలీవుడ్ నటి రుచి గుజ్జర్ కాన్స్ లుక్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆమె భారత ప్రధాని మోదీ ఫోటోలను నెక్లెస్‌గా ధరించడమే దానికి కారణం. గోల్డ్ కలర్ లెహంగాతో డీప్-ప్లంగింగ్ బ్లౌజ్, స్కర్ట్ ధరించి హర్యాన్వీ దుప్పట్టా ధరించింది. అయితే ప్రధాని మోదీ కమలంలో ఉన్నట్లుగా మూడు లాకెట్లు ఆమె నెక్లెస్‌లో ధరించడమే అందరినీ విస్మయానికి గురిచేసింది. దీనిపై ఆమె మాట్లాడుతూ ప్రధాని మోదీ భారత దేశాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లారని, ఆయన గౌరవార్థం దీనిని ధరించిట్లు పేర్కొంది. అయితే కొందరు నెటిజన్లు దీనిపై సెటైర్లు వేస్తున్నారు.

