Home Page SliderNationalNews Alert

బేషరమ్‌ రంగ్‌ పాటపై బాలీవుడ్‌ నటుడు అసంతృప్తి

బేషరమ్‌ రంగ్‌ పాటపై బాలీవుడ్‌ నటుడు, శక్తిమాన్‌ ముకేశ్‌ ఖన్నా అసంతృప్తి వ్యక్తం చేశారు.  ఈ పాట చూడటానికి చాలా అసభ్యకరంగా ఉందన్నారు. ఇతరుల ఫీలింగ్స్‌ను రెచ్చగొట్టేలా ఉన్న ఇలాంటి పాటలను సెన్సార్‌ బోర్డు ఎలా అనుమతించిందని ప్రశ్నించారు.  సినీ పరిశ్రమ గాడి తప్పిందన్నారు. ఇప్పుడు పొట్టి దుస్తుల్లో నటీనటుల్ని చూపించిన ఫిల్మ్‌మేకర్స్‌.. భవిష్యత్తులో వాళ్లను కూడా నగ్నంగా చూపిస్తారేమో అంటూ ఘాటుగా విమర్శించారు. ఇలాంటి వాటిని అంగీకరించడానికి మన దేశమేమీ స్పెయిన్‌, స్వీడన్‌ కాదన్నారు. యువతను తప్పుదోవ పట్టించే చిత్రాలకు సెన్సార్‌ బోర్డు అనుమతివ్వకూడదని ముకేష్‌ ఖన్నా కోరారు.