అయోధ్య రామాలయ పూజారి భౌతికకాయం సరయూలోకి..
అయోధ్య రామాలయ ప్రధానార్చకులు మహంత్ సత్యేంద్ర దాస్(85) రెండురోజుల క్రితం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన భౌతిక కాయాన్ని రామానందీ శాఖ ఆచారం ప్రకారం జల సమాధి చేయాలని నిర్ణయించారు అర్చకులు. ఆయన శిష్యులు పల్లకీలో అయోధ్య పురవీధులలో ఊరేగించారు. అనంతరం పార్థివ శరీరానికి బరువైన రాళ్లు కట్టి సరయూ నదిలోని తులసీదాస్ ఘాట్ గుండా నది మధ్యకు చేర్చి అక్కడ జలసమాధి చేశారు. ఈ విషయాన్ని ఆలయ తదుపరి అర్చకుడు ప్రతీప్‌దాస్ ధృవీకరించారు. అయోధ్యలోని 1992లో బాబ్రీ మసీదు కూల్చివేసిన అనంతరం అక్కడ ఏర్పాటైన తాత్కాలిక ఆలయానికి ప్రధాన పూజారిగా వ్యవహరించారు సత్యేంద్ర దాస్. గతేడాది నూతన రామాలయ ప్రారంభోత్సవం నుండి ప్రధాన పూజారిగా కొనసాగారు.