Andhra PradeshHome Page Slider

పెనమలూరు నుంచి పోటీ చేస్తా.. పార్టీ తీరుతో గుండె పగిలిందన్న బోడె ప్రసాద్

ఏ తప్పు చేశానని నాకు టికెట్ ఇవ్వరని టీడీపీని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఛాన్స్ ఇవ్వలేకపోవడం దారుణమన్నారు. పెనములూరులో అవకాశం లేదని చెబుతుంటే గుండె కలచివేసిందన్నారు. టీడీపీ హైకమాండ్ పై ఆయన విరుచుకుపడ్డారు. ఓడిపోయినప్పుడు కూడా ఇంతలా బాధపడలేదన్నారు బోడె. కుటుంబంతో గడపకుండా పార్టీ కోసం పనిచేశానన్నారు. పార్టీ కోసం అహర్నిశలు పనిచేసినా గుర్తుంపు లేకుండా చేశారని దుయ్యబట్టారు. పార్టీ ఎన్నికల్లో గెలిచేలా చేసేందుకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పార్టీని ముందుకు తీసుకెళ్తే ఇలా చేశారని విమర్శించారు. కానీ తాను చంద్రబాబు నాయుడి భక్తుడననేన్నారు. చంద్రబాబు నాయుడు కుంటుంబం నుంచి ఏ వ్యక్తిని తీసుకొచ్చినా గెలిపిస్తామన్నారు. కానీ బయట నుంచి తీసుకొచ్చి వ్యక్తిని నిలబెడితే.. నాకన్నా కార్యకర్తలు ఆవేశంగా ఉన్నారన్నారు. నేను బాధపడితే వాళ్లు ఓదార్చుతున్నారన్న బోడె… నా బాధలను ఏ విధంగా వ్యక్తపరచాలో తెలియడం లేదన్నారు.

చంద్రబాబు కాకుండా వేరేవాళ్లు వేస్తే .. వారి నుంచి నియోజకవర్గాన్ని కాపాడుకొని మళ్లీ చంద్రబాబునాయుడికి కానుకగా ఇస్తానన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు చిత్రపటం తీసుకొని ఓట్లడిగి.. టీడీపీ అభ్యర్థిగా గెలిచి టీడీపీలోకి తిరిగి తాను వెళ్తానన్నారు. తనపై 16 కేసులు పెట్టారని… చేయని నేరానికి అటెంప్టివ్ మర్డర్ కేసు పెట్టారని.. అప్పుడు కూడా ఇంతలా బాధపడలేదన్నారు. గన్నవరంలో పార్టీ కార్యాలయంపై దాడి చేస్తే అందరికంటే ముందుగా చేరుకున్నానని… పోలీస్ కేసులు పెట్టినా భయపడలేదన్నారు. ఇప్పటికీ కూడా సీటు వస్తోందని నమ్మకంగా ఉన్నానన్న ఆయన.. పార్టీ పెద్దలు ఎకామిడేట్ చేయలేకపోతున్నామని చెబితే చాలాచాలా బాధ పడ్డానన్నారు. కన్నీళ్లు చూపించో.. ఏడుపు చూపించో బాధను చెప్పలేను.. కార్యకర్తలు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. నేను పార్టీ మారను. ఇదే పార్టీలో ఉండి పోరాటం చేస్తా… కార్యకర్తల పక్షాన నిలబడి ఏ విధంగానైనా గెలిచి.. చంద్రబాబుకు బహుమానంగా పెనమలూరు సీట్ ఇస్తానన్నారు. పెనమలూరు నుంచే పోటీ చేస్తా… చివరి క్షణం వరకు చంద్రబాబు, లోకేష్ ఆశీస్సులుంటాయని విశ్వాసం ఉందన్నారు.