మాజీ మంత్రులను అడ్డుకోవడం హేయమైన చర్య
తాండూర్ గిరిజన హాస్టల్‌లో విషాహార బాధిత పిల్లలను పరామర్శించడానికి వెళ్తున్న మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, పార్టీ సీనియర్ నేతలను అరెస్టు చేయడం దుర్మార్గమని కేటిఆర్ అన్నారు.పసిబిడ్డలకు కనీసం ఆహారం పెట్టలేని అమానవీయ ప్రభుత్వం, అరెస్టుల పేరుతో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని తలపిస్తోందని అభిప్రాయపడ్డారు.ప్రజా పాలన అంటే ప్రజా ప్రతినిధులను అక్రమంగా అరెస్టు చేయడమేనా? రేవంత్ అంటూ నిలదీశారు. ఆడబిడ్డలను పరామర్శించే ప్రయత్నాన్ని అడ్డుకుంటున్న ఈ అమానవీయ ప్రభుత్వ వైఖరిని ప్రజాస్వామ్య వాదులంతా ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు.ప్రభుత్వ బాధ్యతను గుర్తుచేస్తున్న ప్రతిపక్షాన్ని అడ్డుకోవడం కాకుండా, పసిబిడ్డలకు పోషకాహారం అందించడం, సరైన సౌకర్యాలు కల్పించడంపై దృష్టి పెట్టడం మంచిదని హితవు పలికారు.

