డ్రగ్స్ పార్టీపై మెరుపు దాడులు
నార్సింగిలో డ్రగ్స్ పార్టీపై పోలీసుల దాడులు నిర్వహించి పలువురిని అరెస్ట్ చేశారు.ఈ దాడుల్లో గతంలో డ్రగ్స్ కేసులో కీలకంగా మారిన ప్రియాంకారెడ్డి రెండోసారి పట్టుబడటం గమనార్హం.మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న జిఆర్సి రెసిడెన్సీ భవనంలో మధ్యాహ్నం సమయంలో పెంట్ హౌస్ పైన గంజాయి సేవిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు పక్కాగా ఈ దాడులు నిర్వహించారు.నలుగురు స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటుండగా ప్రియాంక రెడ్డిని అరెస్ట్ చేశారు. యూరిన్ టెస్ట్ కిట్టు ద్వారా డ్రగ్ స్క్రీన్ టెస్ట్ నిర్వహించగా గంజాయి తీసుకున్నట్లు నిర్ధారణ అవడంతో ఎస్.వో.టి.పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.తాజా అరెస్ట్‌లో ఐదుగురికి డ్రగ్స్ పాజిటివ్ రావడంతో న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా వారికి రిమాండ్ విధించారు.

