అభివృద్ధే బీజేపీ అజెండా
నిజామాబాద్: అభివృద్ధి బీజేపీ అజెండా అని ఆ పార్టీ నిజామాబాద్ అర్బన్ అభ్యర్థి ధన్‌పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. మంగళవారం హమాల్‌వాడిలో ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేశారు. అవినీతి ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారు. ఈసారి బీఆర్ఎస్‌ను మార్చాలని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే ఉచిత విద్య, వైద్యంపై దృష్టి పెడతామన్నారు. 370 ఆర్టికల్ రద్దు, ట్రిపుల్ తలాక్, అయోధ్య రామమందిర నిర్మాణం తదితర అనేక ఘనతలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సాధించిందని పేర్కొన్నారు.

