NationalNews

గుజరాత్‌లో బీజేపీ స్వీప్, ఆప్ చిత్తు

గుజరాత్‌లో మరోసారి బీజేపీ స్వీప్ చేయబోతోందని సర్వేలు తేల్చేశాయ్. పోల్ ఆఫ్ పోల్స్ అంచనా ప్రకారం గుజరాత్‌లో బీజేపీకి సుమారుగా 131 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. గుజరాత్‌లో మొత్తం 182 స్థానాలుండగా మెజార్టీ మార్క్ 92. గత ఎన్నికల్లో కేవలం 99 స్థానాలతో సరిపెట్టుకున్న బీజేపీ ఈసారి భారీగా ఓట్లను, సీట్లను రాబట్టుకోబోతుందని సర్వేలు లెక్కగట్టాయి. ఇక హిమాచల్ ప్రదేశ్‌లో వరుసగా రెండోసారి బీజేపీ విజయం సాధించబోతోంది. కొండగట్టుపై ఏ పార్టీ అయినా ఒక్కసారి మాత్రమే విజయం సాధిస్తోందన్న నానుడిని ఈసారి బీజేపీ బద్ధలు కొట్టబోతోంది. వరుసగా రెండోసారి విజయం సాధించబోతున్నట్టు సర్వేలు అంచనా వేస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో మొత్తం 68 స్థానాలకు గాను మెజార్టీ మార్క్ 35 కాగా.. బీజేపీ 37 స్థానాలు దక్కించుకోనుందని సర్వేలు అభిప్రాయపడుతున్నాయి. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఆప్ సత్తా చాటింది. 250 స్థానాల్లో మెజార్టీ మార్క్ 126 కాగా, ఆమ్ ఆద్మీ పార్టీకి 155 స్థానాలు వస్తాయని తేల్చాయి.