బండి సంజయ్‌కు వ్యతిరేకంగా బీజేపీ ముఖ్య నేత హాట్ కామెంట్స్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు వ్యతిరేకంగా పార్టీ నేతలు ఒక్కొక్కరు గొంతు విప్పుతున్నారు. ఎంపీ అర్వింద్ వ్యాఖ్యలను వంద శాతం సమర్థిస్తానన్నారు బీజేపీ సీనియర్ నేత శేఖర్జీ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ చేయాల్సిన పనిని అర్వింద్ చేశారన్నారు. ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి బండి సంజయ్‌వి పరిణితి లేని వ్యాఖ్యలని మండిపడ్డారు. అసంబద్ధ, నియంతృత్వ, అప్రజాస్వామిక చేష్టల కారణంగా రాష్ట్రంలో ప్రస్తుతమున్న పరిస్థితికి నిదర్శనమన్నారు. మసీదులు కూల్చడాలు, ముద్దులు పెట్టడాలు, బ్లాక్ మెయిల్ రాజకీయాలు, సెటిల్మెంట్ వ్యవహారాలతో పార్టీని ఇరుకునపెడుతున్నారన్నారు. సుదీర్ఘంగా పార్టీని నమ్ముకున్న వారిని వదిలేయడం, పార్టీని సొంత ఆర్థిక ప్రయోజనాలుకు వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు.
నేతలను.. వాడుకొని వదిలెయ్యడం.. బీజేపీ సంస్కృతి కాదన్నారు శేఖర్జీ. ఇలాంటివి ఇటీవల కాలంలో తెలంగాణ బీజేపీలో యధేచ్ఛగా సాగుతన్నాయని విమర్శించారు. మొత్తం వ్యవహారాలను ఆధారాలతో సహా నిరూపించడానికి సిద్ధమన్నారు శేఖర్జీ. ఐతే పార్టీలో వినే సంస్కృతి లేకుండా పోయిందన్నారు. అందుకే సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నానన్నారు. రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి మూడడుగులు ముందుకు… ఆరడుగులు వెనక్కి అన్న చందంగా ఉందన్నారు. ఇది రాష్ట్ర నాయకత్వం స్వయంకృతమన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పతనమవుతుంటే… బీజేపీ ఇలా ఉండటం పార్టీ దురావస్థకు కారణమన్నారు. జాతీయ పార్టీ పూర్తిగా సహకరిస్తున్నా… స్థానిక పార్టీ ముందుకెళ్లలేకపోతోందని విచారం వ్యక్తం చేశారు శేఖర్జీ.

పేరాల శేఖర్జీ పార్టీ ముఖ్యల్లో ఒకరు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతటా వ్యాపింపజేశారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో పార్టీ ఎదుగదలకు ప్రత్యక్షంగా ఎంతగానో కృషి చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో పార్టీ ఈ రోజు సాధిస్తున్న విజయాలకు పునాది వేసింది శేఖర్జీ అని పార్టీ నేతలు చెప్తారు. అలాంటి వ్యక్తి… రాష్ట్ర పార్టీలో జరుగుతున్న వ్యవహారాలపై గళం విప్పడం చూస్తుంటే వ్యవహారం ముదిరిపాకానపడుతున్నట్టుగా కన్పిస్తోంది. నిజామబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కవితపై బండి వ్యాఖ్యలను సమర్థించబోనన్నారు. సంజయ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే మంచిదన్నారు. సామెతలను ఉపయోగించే సమయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదా పవర్ సెంటర్ కాదని… అందరినీ సమన్వయం చేసే బాధ్యత మాత్రమేనన్నారు అర్వింద్. సంజయ్‌కు వ్యతిరేకంగా గళం విప్పుతున్న నేతలకు ఇప్పుడు అర్వింద్, శేఖర్జీ వ్యాఖ్యలు మరింత బలాన్నిస్తున్నాయని పార్టీ ముఖ్యులు గుసగుసలాడుకుంటున్నారు.

