KVPకి కౌంటర్ ఇచ్చిన బీజేపీ కార్యదర్శి
‘అదానీ నుంచి ప్రధాని మోడీ గారికి వాటా వెళ్తోంది’ అంటూ కాంగ్రెసు మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఆరోపణల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణు వర్థన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. వైయస్ఆర్ గారి ఆత్మ బంధువు కాంగ్రెసు మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు గారు సరిగ్గా ఏప్రెల్ ఒకటో తేదీ మాట్లాడం ఎవరిని ఏప్రిల్ ఫూలా చేయడానికి? ఇలా మాట్లాడుతున్నారని ట్విటర్‌లో ఫైరయ్యారు. అయినా వాటాలు, ఒప్పందాలు, అవినీతి గురించి మీరు మాట్లాడడం ఏంటి సార్, అందులో మీరు PhD చేసినోళ్ళు అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అంతా అవినీతి మయం అని, తమ తప్పులు తామెరుగని విమర్శించారు.