ఢిల్లీలో కమల వికాసం..ఆప్ విలవిల
ఢిల్లీలో బీజేపీ ప్రభజనం కనిపిస్తోంది. నేటి ఎన్నికల ఫలితాలలో బీజేపీ పార్టీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. ప్రస్తుత సీఎం ఆతిశీ సహా పలువురు నేతలు వెనుకంజలో ఉన్నారు. ఆప్ అధ్యక్షుడు కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానంలో స్వల్ప ఆధిక్యతలో కొనసాగుతున్నారు. కాల్‌కాజీలో ఆతిశీ 1350 ఓట్ల వెనుకంజలో ఉండగా, ఆప్ అభ్యర్థి సత్యేంద్ర జైన్ షాకూర్ బస్తీలో 6 వేల ఓట్లకు పైగా వెనుకంజలో ఉన్నారు. జంగాపురాలో మనీస్ సిసోడియా ఆధిక్యతలోకి వచ్చారు. బిజ్వాసన్ నుండి బీజేపీ అభ్యర్థి కైలాశ్ గెహ్లాట్ ముందంజలో ఉన్నారు. ఇప్పటికే దాదాపు 50 స్థానాలలో ముందంజలో బీజేపీ దూసుకుపోతోంది. బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటి 36 స్థానాలు సులభంగా సాధిస్తోంది. కాంగ్రెస్ ఇప్పటి వరకూ కేవలం ఒక్క స్థానంలో కూడా ఆధిక్యతలో రాలేదు. ఢిల్లీ ఫలితాలపై కాశ్మీర్ ముఖ్యమంత్రి విమర్శలు కురిపిస్తున్నారు. మనలో మనం కొట్టుకుంటే ఇలాగే ఉంటుందంటూ ఇండియా కూటమిని విమర్శిస్తున్నారు.