Home Page SliderNational

ముందస్తు ఎన్నికలకు బీజేపీ సిద్దం

ఐదు రాష్ట్రాల ఎన్నికల హడావిడి ముగిసింది. ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. ఇక లోక్ సభ ఎన్నికలకు కసరత్తు మొదలయ్యింది. మూడు రాష్ట్రాలలో గెలిచి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ అదే స్పీడుతో లోక్ సభ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ముందస్తు ఎన్నికలకు వెళదామనే ఆలోచనలో కూడా బీజేపీ పెద్దలు ఉన్నట్లు సమాచారం. 2024 జూన్ 16 వరకూ లోక్ సభకు సమయం ఉండగా మార్చి, ఏప్రిల్ నెలలోనే లోక్‌సభ ఎన్నికలు జరపాలని ప్రభుత్వ ఆలోచన. దీనితో ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని సమాచారం. అదే జరిగితే ఫిబ్రవరి నుండి పార్టీల ఎన్నికల కసరత్తు మొదలవుతుంది. సర్వేలు, రివ్యూలు హడావుడి, ఉచిత హామీల తాయిలాలు, పార్టీలు అభ్యర్థుల టిక్కెట్లు వంటి దేశవ్యాప్త ఎన్నికల పండుగకు ద్వారాలు తెరుచుకున్నట్లే.