రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..సీరియస్ కేసులు నమోదు
ప్రతిపక్షనాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీలు ఫైర్ అవుతున్నారు. నేడు పార్లమెంట్ ఆవరణలో జరిగిన గందరగోళం, నిరసనల సందర్భంలో తమ ఎంపీపై రాహుల్ దాడికి పురిగొల్పాడని కేసులు నమోదు చేసింది. శాంతియుతంగా నిరసనలు చేస్తున్న తమపై రాహుల్ దాడికి పాల్పడ్డాడని బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ తెలిపారు. రాహుల్ గాంధీ తోయడం వల్లే బీజేపీ ఎంపీలు ప్రతాప్ చంద్ర సారంగి, ముకేశ్ రాజ్‌పుత్ గాయపడ్డారని ఆరోపించారు. నాగాలాండ్‌కు చెందిన బీజేపీ మహిళా ఎంపీ ఫంగ్నోన్ కొన్యాక్ కూడా తనను రాహుల్ అసౌకర్యానికి గురి చేశారని ఆరోపించింది. దీనితో రాహుల్ గాంధీపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీ పోలీస్ స్టేషన్‌లో రాహుల్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. 109, 117, 125,131,351 వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.