భువనగిరి పట్టణంలో బీజేపీ ఎన్నికల ప్రచారం
భువనగిరి: రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు బుద్ధి చెప్పాలని బీజేపీ అభ్యర్థి గూడూరు నారాయణ రెడ్డి ఓటర్లను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని పలు వార్డులలో ఆయన ప్రచారం నిర్వహించారు. భువనగిరి నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి పూర్తిగా విస్మరించారు. తనకు అవకాశం ఇస్తే రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని, ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరారు. ఒక్కసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఓటర్లను ఆకర్షించేందుకు టైలర్ షాపుకు వెళ్లి కుట్టుమిషన్ కుట్టారు. ప్రచారంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు బాలరాజు, ఉమాశంకర్ రావు, నాయకులు జనగాం నరసింహాచారి, బలరాం, సంతోష్, రత్నపురం శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

