Breaking NewscrimeHome Page SliderNational

ప్రియాంక బుగ్గ‌ల‌పై రాజ‌కీయ దుమారం

బీజెపి ఎంపి రాజేష్ బిధూరీ వ్యాఖ్య‌లు దేశ వ్యాప్తంగా కాంగ్రెసీయుల ఆగ్ర‌హానికి కార‌ణ‌మౌతున్నాయి.ఢిల్లీ ఎన్నికల ప్ర‌చారంలో ఎంపి మాట్లాడుతూ…త‌మ పార్టీ అధికారంలోకి రాగానే ఢిల్లీ రోడ్ల‌ను ప్రియాంక గాంధీ బుగ్గ‌ల్లా మారుస్తామ‌ని చెప్ప‌డంతో గ‌త రెండు రోజుల నుంచి వివాదం ర‌గులుతూ ఉంది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు,ఎన్‌.ఎస్‌.యూ.ఐ ఆధ్వ‌ర్యంలో నాంపల్లిలో బీజేపీ ఆఫీస్ ని మంగ‌ళ‌వారం ముట్ట‌డించారు.దాంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేశారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకుని బాహాబాహికి దిగారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేర‌కుని ప‌రిస్థితి నిలువ‌రించే ప్ర‌య‌త్నం చేశారు. ఇరు పార్టీల్లోని పలువురికి గాయాలయ్యాయి. పోలీసుల‌కు కూడా దాడిలో గాయప‌డ్డారు.