Andhra PradeshHome Page Slider

రాహుల్ గాంధీపై బీజేపీ అనుచిత వ్యాఖ్యలు..షర్మిల ధర్నా

రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఆయనకు ప్రాణాపాయం ఉందని ఈసీకి కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఏపీ ఏఐసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధర్నాకు దిగారు. ఆమెతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఈ ధర్నాలో పాల్గొన్నారు. బీజేపీ పెద్దల అండతోనే రాహుల్‌పై కుట్రలు జరుగుతున్నాయని, దీనిపై వారు రాహుల్‌కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీని ఉగ్రవాదిగా పేర్కొంటూ పలువురు ఎన్డీయే నేతలు ఆయనపై దాడి చేస్తామని బెదిరిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అజయ్ మాకెన్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో రాహుల్ గాంధీ నాలుకను ఎవరైనా కోస్తే వారికి రూ.11లక్షలు రివార్డు ఇస్తానంటూ శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ చేసిన వ్యాఖ్యల గురించి ప్రస్తావించారు. రాహుల్‌కి రక్షణ కల్పించాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా స్పందించారు. ప్రజాస్వామ్యదేశంలో హింసకు తావులేదని, రాహుల్‌కు ప్రజల్లో పెరుగుతున్న మద్దతు చూసి, బీజేపీ నాయకులకు కంటిమీద కునుకు లేకుండా పోయిందని ఆయన ఎద్దేవా చేశారు.