Breaking NewsHome Page SlidermoviesNationalNews AlertTrending Today

ఎన్టీఆర్ అభిమానులకు ‘బర్తడే’ గిఫ్ట్..’వార్ 2′ అప్‌డేట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త చిత్రం వార్ 2 టీమ్ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. ‘వార్ 2’ టీజర్‌ను రిలీజ్ చేసింది. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అధ్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 14న రిలీజ్ కానుంది. గతంలో స్పై థ్రిల్లర్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ‘వార్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. ఇందులో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించారు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. అదే ‘వార్ 2’. ఇందులో హృతిక్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ పాత్ర ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ లో ఉంటుందని కూడా ప్రచారం జరుగుతుంది. ఎన్టీఆర్ మొదటిసారి బాలీవుడ్‌లో నటిస్తుండడంపై ఈమూవీ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ టీజర్ ఎక్స్‌లో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.