పని చేసే ఇంటికే కన్నం వేశారు..
హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ పరిధిలోని బండ్లగూడ మాపెల్ టౌన్ విల్లాలో పనిమసుషులుగా చేరి ఓ ఇంట్లో నుంచి బంగారు నగలతో ఉడాయించిన బీహార్ దంపతులను రాజేంద్రనగర్ పోలీసులు పట్టుకున్నారు. చోరీ చేసిన ఆభరణాలతో బీహార్ కు వెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు చాకచాక్యంగా వ్యవహరించి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఇద్దరిని పట్టుకున్నారు. వారి నుంచి బంగారు ఆభరణాలను స్వాధీనం చేస్తున్నారు. నిందితులు బీహార్ కు చెందిన నవీన్ కుమార్, భారతీలుగా గుర్తించారు. బండ్లగూడలోని విల్లాలో ఉంటున్న డాక్టర్ కొండల్ రెడ్డి వద్ద పనికి చేరి ఇంటిలోని బీరువాలో దాచిన బంగారు ఆభరణాలను వారు నిన్న పొద్దున్న చోరీ చేసి పారిపోయారు.