Breaking NewscrimeHome Page SliderNational

గుజ‌రాత్‌లో అతిపెద్ద డేటా సెంట‌ర్‌?

ప్ర‌పంచ పారిశ్రామిక దిగ్గ‌జం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ను భారత్ లో నిర్మించాలని భావిస్తున్న‌ట్లు తెలిసింది.గుజరాత్ లోని జామ్ న‌గ‌ర్ లో దీన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నారు.దీని కోసం ఇప్ప‌టికే ముకేశ్ అంబానీ క‌స‌ర‌త్తు ప్రారంభించిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ఈ సెంట‌ర్ ఏర్పాటు కోసం ఎన్విడియా నుంచి అధునాతన ఏఐ చిప్ లను కొనుగోలు చేయనుంది. ఈ డేటా సెంటర్ మూడు గిగావాట్స్ సామర్థ్యంతో ఏర్పాటు కావచ్చని అంచనాలున్నాయి.ఇది గ‌నుక కార్య‌రూపం దాల్చితే ప్ర‌పంచ డేటా సెంట‌ర్ల‌పై భార‌తీయులు ఆధార‌ప‌డాల్సిన అవస‌రం ఉండ‌దు.అంతే కాదు…ఇప్పడు ల‌భిస్తున్న దాని కంటే ఇంకా చౌక‌గా డేటా ల‌భించే అవ‌కాశాలున్నాయి.