“బిగ్‌బాస్” ఓ పనికిమాలిన షో
బిగ్‌బాస్ షో మళ్లీ ప్రారంభమైన విషయం తెలిసిందే. బిగ్‌బాస్ షో కి అభిమానులు కూడా ఎక్కువే. అయితే ఈ షో గురించి సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిగ్‌బాస్ వచ్చిన ప్రతి సారి ఏదో ఒక విమర్శతో వార్తల్లో నిలుస్తారు నారాయణ. ఈ నేపధ్యంలోనే తాజాగా స్టార్ట్ అయిన బిగ్‌బాస్ షో గురించి ఈ విధంగా అన్నారు. బిగ్‌బాస్ ఒ పనికిమాలిన షో అని , డబ్బులకు కక్కుర్తి పడే వాళ్లు ఉన్నంత వరకు ఇలాంటి షోలు ఉంటాయన్నారు. అంతే కాకుండా ఈ షో ద్వారా ఏం సందేశం ఇస్తున్నారో ప్రేక్షకులే ప్రశ్నించాలన్నారు. సమాయాన్ని వృధా చేసే కార్యక్రమమే తప్ప దీని ద్వారా ఎటువంటి ప్రయోజనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

