NationalNews

బిగ్ బాస్ బ్యాన్.. హైకోర్టు తీర్పుతో నిర్వాహకుల్లో టెన్షన్

బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలని ఏపీ హైకోర్టులు పిటిషన్ దాఖలయ్యింది. పిటిషనర్ జగదీశ్వర్ రెడ్డి తరపున లాయర్ శివప్రసాద్ పిల్ దాఖలు చేశారు. బిగ్ బాస్ షోతో యువత పెడదోవపడుతున్నారంది హైకోర్టు. అశ్లీలతతోపాటు, అసభ్యతను ప్రమోట్ చేసేలా షో నిర్వహిస్తున్నారని తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి 2019లో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అసనుద్దీన్, జస్టిట్ టి రాజశేఖరరావులతో కూడిన ధర్మాసనం కేసును విచారించింది. కేసు 2019లో వేస్తే ఇప్పటి వరకు విచారణకు రాలేదా అంటూ న్యాయమూర్తులు పిటిషనర్‌ను ప్రశ్నించారు.

ఇండియన్ బ్రాడ్‌క్యాస్టింగ్ ఫౌండేషన్ నిబంధనల ప్రకారం సమయాన్ని పాటించాలని పిటిషనర్ కోరారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మాత్రమే షోను అనుతించాలని కోరారు. బిగ్ బాస్‌షోలో అశ్లీలత డోసు ఎక్కువవుతోందని విమర్శించారు. పిటిషన్ పై విచారించిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అశ్లీలతపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 1970ల్లో ఎలాంటి సినిమాలు వచ్చాయో తెలుసుకదా అంటూ వ్యాఖ్యానించింది. కేసు విచారణను అక్టోబర్ 11కు వాయిదా వేసింది.